లోకనాయకుడు, సీనియర్ నటుడు, క్రియేటివ్ పర్సన్, అనుభవజ్ఞాని అయిన కమల్‌హాసన్ పరిస్థితి చూస్తుంటే ఆయనకు కూడా ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు వస్తోంది? అనే సందేహం రాకమానదు. ఆయన నటించిన మూడు చిత్రాలు ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్నాయి. ‘విశ్వరూపం2, ఉత్తమవిలన్, పాపనాశం(దృశ్యం) చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నాడు. అయితే అవేమీ విడుదల కాకుండానే ఆయన మరిన్ని చిత్రాలు చేయడంపై దృష్టిపెట్టాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా, విమాన దుర్ఘటనపై ఒక సినిమా, టిప్పుసుల్తాన్‌గా ఓ చిత్రం, తెలుగులో ఓ స్ట్రెయిట్ చిత్రం... వీటితో పాటు అప్పుడెప్పుడో ఆగిపోయిన ‘మరుదనాయగం’ను పున:ప్రారంభించడం వంటి సినిమాలు ఆయన చేయనున్నాడు. ఒకేసారి ప్లానింగ్‌లేకుండా ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతే కమల్‌కు బాగానే ఉంటుందేమోగానీ, ఇతరులకు మాత్రం ఆయన అయోమయం క్రియేట్ చేస్తున్నట్లు అవుతుంది.