లండన్ తెలుగు సంఘం(తాల్) ప్రెస్టీజియస్ హయ్యస్ట్ అవార్డుని అందుకోనున్న డా. మోహన్ బాబు
తెలుగు సినిమాకే తనదైన విలక్షణ నటనతో వన్నె తెచ్చిన నటుడు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన గుర్తింపు తెచ్చుకుని తెలుగువారి కీర్తిని వ్యాప్తి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నీ రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్న మోహన్ బాబుని లండన్ తెలుగు సంఘం(తాల్) వారు తాల్ హయ్యస్ట్ ప్రెస్టిజియస్ అవార్డుతో సత్కరించనున్నారు. మార్చి 28న లండన్ నగరంలో జరిగే 10వ ఉగాది వార్షికోత్సవ సంబరాల సందర్భంగా మోహన్ బాబుకి ఈ అవార్డుని బహుకరించనున్నారు.
2005లో స్థాపించబడిన ఈ లండన్ తెలుగు సంఘం అక్కడ తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాలను అభివృద్ధి చేస్తూ తెలుగు అభ్యున్నతికి తోడ్పడుతుంది. ప్రతి సంవత్సరం తెలుగు ఉగాది వేడుకలను సెలబ్రేట్ చేయడమే కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులను బహుకరిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం డా. మోహన్ బాబుకి అవార్డుని అందజేస్తున్నారు.