Advertisementt

‘మా’ ప్రెసిడెంట్‌గా గెలిచి చూపిస్తానంటున్న జయసుధ

Tue 24th Mar 2015 12:05 PM
movie artists association,jayasudha panel,murali mohan,manchu laxmiprasanna,naresh  ‘మా’ ప్రెసిడెంట్‌గా గెలిచి చూపిస్తానంటున్న జయసుధ
‘మా’ ప్రెసిడెంట్‌గా గెలిచి చూపిస్తానంటున్న జయసుధ
Advertisement
Ads by CJ

మురళీమోహన్‌ అధ్యక్షుడుగా కొనసాగుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గడువు మార్చి నెలాఖరుతో ముగుస్తున్న సందర్భంగా మార్చి 29 ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓ వైపు జయసుధ, మరోవైపు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 24న ఫిలింఛాంబర్‌లో జయసుధ ప్యానెల్‌ మీడియాతో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు, కృష్ణంరాజుతోపాటు ప్యానెల్‌ సభ్యులు పాల్గొన్నారు. 

మురళీమోహన్‌: ఇప్పుడున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గడువు ఈనెలాఖరుతో ముగుస్తోంది. అందుకే ఈనెల 29న జరిగే ఎలక్షన్స్‌లో కొత్త టీమ్‌ ఎన్నుకోబడుతుంది. పోటీ చేస్తున్న మెంబర్స్‌ అందర్నీ పరిచయం చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మద్రాస్‌లో ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వున్నప్పుడు కృష్ణంరాజుగారు ప్రెసిడెంట్‌గా వుండేవారు. సారధిగారు సెక్రటరీగా, నేను జాయింట్‌ సెక్రటరీగా వుండేవాడ్ని. అక్కడ అసోసియేషన్‌ని చాలా అద్భుతంగా నిర్వహించారు. హైదరాబాద్‌కి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడ అసోసియేషన్‌ లేదు. ఒక సందర్భంలో వైజాగ్‌ వెళ్ళి సుబ్బరామిరెడ్డిగారు ఏర్పాటు చేసిన క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొని తిరిగి వచ్చేటపుడు ప్లేన్‌లో హైదరాబాద్‌లో అసోసియేషన్‌ లేదు కాబట్టి మనం ఒక అసోసియేషన్‌ పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రపోజల్‌ పెట్టాను. దానికి అందరూ ఓకే అనడం, మరుసటి రోజే అందరం సమావేశమై ‘మా’ అసోసియేషన్‌ చిరంజీవిగారు ప్రెసిడెంట్‌గా, నేను సెక్రటరీగా ప్రారంభించడం జరిగింది. ఫండ్‌ రైజింగ్‌ కోసం క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడి అసోసియేషన్‌కి కొంత డబ్బు సమకూర్చడం జరిగింది. ఆరోజు మేం చేసిన మొదటి పని ఆర్టిస్టులు ఎవరైనా చనిపోతే అనాధగా వుండిపోకూడదు, వారి ఆఖరి యాత్ర ఘనంగా వుండాలని దానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్‌ 2 లక్షలు ఇన్‌ పేషెంట్‌కి చెయ్యడం, 20 వేలు ఔట్‌ పేషెంట్‌కి చేస్తూ వారికి సహకరిస్తున్నాం. అలాగే సినీ వర్కర్స్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌ పేరుతో  ఆ సినిమాకి వచ్చిన లాభాలతో ఓ అసోసియేషన్‌ ఫామ్‌ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్‌తో పేద కళాకారులందరికీ సహాయం చెయ్యాలని నిర్ణయించారు. అందులో ‘మా’ నుంచి 250 మందిని మెంబర్స్‌గా చేర్పించాం. వాళ్ళందరికీ హెల్త్‌ కార్డులు ఇప్పించాం. వీరి కోసం గవర్నమెంట్‌ ఒక హాస్పిటల్‌ పెట్టింది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు. ఏదైనా పెద్ద జబ్బు చేస్తే అపోలో, నిమ్స్‌, కిమ్స్‌ వంటి హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటే దానికయ్యే ఖర్చు అంతా వెల్‌ఫేర్‌ ఫండ్‌ కట్టడం జరుగుతోంది. అలాగే మందులు కొనుక్కోలేని వారు వుంటే వారికి ఉపయోగపడేలా విజయనిర్మలగారు ప్రతి నెల 1వ తారీఖున 15 వేల రూపాయల చెక్కును రెండు సంవత్సరాలుగా ఇస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావుగారు బ్రతికుండగా ఒక ప్రపోజల్‌ పెట్టారు. ఏ ఆర్టిస్టు అయినా బర్త్‌డే జరుపుకుంటే అది ఎన్నో పుట్టినరోజైతే అన్ని వేలుగానీ, వందలుగానీ, రూపాయలుగానీ అసోసియేషన్‌కి చందాగా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పారు. ఆవిధంగా నాగేశ్వరరావుగారు, విజయనిర్మలగారు, జమునగారు, గీతాంజలిగారు ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ సాధ్యమైనంత మేర సేవ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అపోలో హాస్పిటల్‌లో జనరల్‌ చెకప్స్‌ చేయిస్తున్నాం. ఈమధ్య బాలకృష్ణగారితో మాట్లాడి బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌లో క్యాన్సర్‌ టెస్టులు కూడా సభ్యులందరికీ చేయించాం. గత సంవత్సరంగా నేను అందరికీ చెప్తున్నదేమిటంటే ఎప్పుడూ మేమే వుండడం కాదు, యంగ్‌ హీరోలందర్నీ తీసుకొచ్చి వారిని ఇన్‌వాల్వ్‌ చేద్దామని గత సంవత్సరంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అలాగే అంటూ అందరూ చెప్తూ వచ్చారు. చివరికి మాకు అంత వయసు, అనుభవం లేదు మీరే నడపండి అని చెప్పారు. అయితే నేను మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడూ నేనే వుండడం కాదు, ఎవరో ఒకరిని ప్రెసిడెంట్‌గా చెయ్యాలనుకున్నాను. ఇప్పటివరకు మహిళలకు అసోసియేషన్‌లో అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈసారి జయసుధను ప్రెసిడెంట్‌గా ప్రపోజ్‌ చేస్తున్నాం. ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌గారి కంటే, ఇన్ని టెర్మ్స్‌ చేసిన నాకంటే కూడా సీనియర్‌ నటి జయసుధగారు. మేము ఇండస్ట్రీకి రాక ముందే ఆమె వచ్చారు. ఆవిడ ఒక అద్భుతమైన టీమ్‌ని ఎంపిక చేసుకోవడం జరిగింది. 

కృష్ణంరాజు: నేను మద్రాసులో 18 సంవత్సరాలు ప్రెసిడెంట్‌గా చేసినప్పటికీ నాకంటే మురళీమోహన్‌ బాగా చేశాడు. మీరు బాగానే చేస్తున్నారు కదా మీ ప్యానెలే వుంటే బాగుంటుందని చెప్పాను. అయితే పార్లమెంట్‌లో అతనికి వుండే ఇబ్బందుల వల్ల, బిజీ వల్ల చెయ్యలేకపోతునానన్న భావంతో జయసుధని ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా చాలా సంవత్సరాలు పనిచేసింది. ఆవిడమీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మనవాళ్ళు ఎప్పుడైతే జయసుధ పేరు చెప్పారో వండర్‌ఫుల్‌ అనుకున్నాను. మహిళలకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు జయసుధ ఆధ్వర్యంలో మన పూర్వ వైభవం తీసుకురావాలని మురళీమోహన్‌కి చెప్పడం జరిగింది. దానికి మేమంతా కలిసి కృషి చేస్తాం.

పరుచూరి వెంకటేశ్వరరావు: జయసుధగారికి సహజనటి అనే సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్‌ని అందంగా అద్దాల బీరువాలో పెట్టుకోకుండా ఆమె ఎంత సహజనటో మనందరికీ చూపించింది. అక్కగా, చెల్లెలుగా, భార్యగా, వదినగా, ప్రియురాలిగా అన్ని క్యారెక్టర్స్‌లోనూ సహజంగా నటించింది. ఇప్పుడు ‘మా’ ప్రెసిడెంట్‌గా కూడా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తుంది. 12 సంవత్సరాల క్రితం ట్రెజరర్‌గా వున్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జయసుధ కోసమే ట్రెజరర్‌గా పోటీ చేస్తున్నాను. జయసుధ ఏ పనైనా స్టార్ట్‌ చేస్తే దాన్ని సాధించి తీరుతుంది. అందుకే ఆమెను అందరూ గెలిపించాలని కోరుతున్నాను. 

నరేష్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నడపడానికి ఓర్పు అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ గత 20 సంవత్సరాలుగా ప్రతి అధ్యక్షుడు సంపూర్ణంగా నిర్వర్తిస్తూ నడపడం వల్లే ‘మా’ ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశంలోనే గర్వపడే స్థాయిలో వుంది. ఇక్కడ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మేం అభినందిస్తాం. ఎందుకంటే ‘మా’ భవిష్యత్తు మీ భవిష్యత్తు అవుతుంది. మావరకు మా జయసుధగారిని గెలిపించుకుంటాం. మీ అందరి ఆశీర్వాదం వుంటే ఈ అసోసియేషన్‌ మరింత ముందుకు వెళ్తుంది. 

మంచు లక్ష్మీ ప్రసన్న: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చరిత్రలో ఫస్ట్‌ టైమ్‌ ఒక మహిళ ప్రెసిడెంట్‌గా నిలబడుతోంది. జయసుధగారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. 

జయసుధ: ఇది మేల్‌ డామినేటెడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ. మహిళలకు ఇక్కడ చోటు లేదు అనుకున్నప్పుడు 43 సంవత్సరాలుగా నేను నటిస్తూ నా స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాను. నన్ను ప్రెసిడెంట్‌గా నిలబడమని మురళీమోహన్‌గారు అన్నప్పుడు నేను యునానిమస్‌గా అయితే చేస్తాను. జీవితంలో ఇన్ని సాధించిన తర్వాత ఇప్పుడు ఓడిపోవడం అనేది జరిగితే బాగుండదు అన్నాను. కానీ, కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, కొన్ని మాటలు విన్న తర్వాత నేను ఎందుకు నిలబడకూడదు, ఎందుకు గెలవకూడదు అనిపించింది. రాజకీయంలో వుండడంవల్ల ఓటమిని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు వచ్చింది. నేను నటిని కాబట్టి నన్ను ఎమ్మెల్యే చెయ్యలేదు. నేను చేసిన సర్వీస్‌ చూసి నాకు టిక్కెట్‌ ఇచ్చారు. మా అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా గవర్నమెంట్‌ నుంచే కాకుండా మనం ఏవిధంగా ఫండ్స్‌ తీసుకురాగలం అనేది ఆలోచించి ఇక్కడే కాకుండా ఇతర ఇండస్ట్రీ నుంచి కూడా మనం ఏవిధంగా సహాయం పొందగలం అనేది ఆలోచిస్తాం. ఇది ఇలా వుంటే ‘మా’ ఎలక్షన్స్‌లో రాజకీయ నాయకుల ఇంటర్‌ఫియరెన్స్‌ వుండకూడదు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక మహిళ నిలబడుతోందంటే ఆమెకు సపోర్ట్‌ చెయ్యాలే తప్ప ఆమెను ఓడిరచండి అని చెప్పడం అనేది కరెక్ట్‌ కాదు. ఆ మాట రావడానికి కారణం వాళ్ళు వెళ్ళి అడగడం వల్లే వచ్చింది. ఒక మగవాడి విజయం వెనుక స్త్రీ వుంటుంది. అలాగే ఒక స్త్రీ విజయం వెనుక మగవారు వుండరా? నాకు ఇండస్ట్రీ తరఫున చాలా మగవారి సపోర్ట్‌ వుంది. ఇప్పుడు ఒక మహిళ ఓడిపోయిందంటే ఎప్పటికీ ప్రజల్లో ఇండస్ట్రీ అంటే మర్యాద వుండదు. నన్ను గెలిపిస్తే ఈ రెండు సంవత్సరాలు తప్పకుండా కష్టపడి పనిచేస్తాను. మాట నిలబెట్టుకుంటాను.  తప్పకుండా అందరూ నన్ను సపోర్ట్‌ చేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. 

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జయసుధ ప్యానెల్‌

ప్రెసిడెంట్‌: జయసుధ 

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: తనికెళ్ళ భరణి

వైస్‌ ప్రెసిడెంట్స్‌: శివకృష్ణ, లక్ష్మీప్రసన్న మంచు(ఏకగ్రీవ ఎన్నిక) 

సెక్రటరీ: ఆలీ

ట్రెజరర్‌: పరుచూరి వెంకటేశ్వరరావు

జాయింట్‌ సెక్రటరీస్‌: నరేష్‌(సీనియర్‌), రఘుబాబు

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌(18):

ఛార్మి

ఢల్లీి రాజేశ్వరి

గీతాంజలి

హేమ

జయలక్ష్మీ

ఐడిపిఎల్‌ నిర్మల

శివపార్వతి

బెనర్జీ

బ్రహ్మాజీ

హరినాథ్‌బాబు

జాకీ

కృష్ణుడు

మహర్షి రాఘవ

నర్సింగ్‌ యాదవ్‌

రాజీవ్‌ కనకాల

శ్రీశశాంక

శ్రీనివాస్‌ పసుమూరి

విద్యాసాగర్‌

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ