నేటితరం నటులు ఆర్థికంగా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. సంపాదించినదంతా ఖర్చుపెట్టి ఆ తర్వాత దీనస్థితి రాకుండా ఉండటానికి హీరోయిన్లుగా తాము సంపాదించిన సొమ్ముతో బయటి వ్యాపారాలు చేస్తున్నారు. హోటల్ బిజినెస్, రియల్‌ఎస్టేట్, వస్త్రదుకాణాలు, బ్యూటీపార్లర్.. ఇలా తమకు నచ్చిన రంగాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. కాగా హాట్‌బ్యూటీ తమన్నా కూడా త్వరలో ఓ వ్యాపారం ప్రారంభించనుంది. ఆమెకు బంగారు నగలంటే చాలా ఇష్టమే కాదు.. వాటిపై ఆమెకు మంచి అవగాహనే ఉందిట. దీంతో ఆమె ‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో దేశంలోని అతి ముఖ్య నగరాలన్నింటిలో చైన్ దుకాణాలను ఏర్పాటు చేయనుంది. ఆ లిస్ట్‌లో చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగుళూర్ వంటి నగరాలు ఉన్నాయి. మొత్తానికి ఈ అమ్మడు ఇంకా తనకు హీరోయిన్‌గా డిమాండ్ ఉండగానే సినిమాల్లో చేస్తూనే మరోవైపు ఇప్పటినుండే బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం.