Advertisementt

‘గబ్బర్‌’ ట్రైలర్‌ లో విషయం ఉన్నట్లేనా!

Fri 27th Mar 2015 03:06 AM
gabbar,ramana,tagore,akshay kumar,krish director,gabbar is back trailer  ‘గబ్బర్‌’ ట్రైలర్‌ లో విషయం ఉన్నట్లేనా!
‘గబ్బర్‌’ ట్రైలర్‌ లో విషయం ఉన్నట్లేనా!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన కథాంశాలతో సామాజిక స్పృహ ఉండే చిత్రాలను తీసే దర్శకుడు క్రిష్‌. తెలుగులో ఆయన తెరకెక్కించిన ‘గమ్యం, వేదం, కృష్ణమ్‌ వందే జగద్గురుమ్‌’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. కాగా తమిళంలో ‘రమణ’గా విడుదలై, ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’గా సూపర్‌హిట్టు అయిన చిత్రాన్ని ఆయన ఇప్పుడు సంజయ్‌లీలా బన్సాలీ నిర్మాతగా అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘గబ్బర్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి ‘ఠాగూర్‌’ చిత్రం చూసిన తెలుగు ప్రేక్షకులకు ఆయన స్థానంలో అక్షయ్‌కుమార్‌ను చూడలేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు మంచి స్పందనే లభిస్తోంది. మే 1న విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ