తెలుగు, తమిళ భాషల్లో మంచి యాక్షన్ కంపోజర్‌గా, ఫైట్‌మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పీటర్‌హెయిన్స్. త్వరలో ఈయన దర్శకుని అవతారం ఎత్తనున్నాడు. తెలుగు, తమిళంతోపాటు తన మాతృభాషైనా వియత్నామీలో కూడా ఆయన ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గత రెండేళ్ల నుండి ఆయన ఇదే పనిలో బిజీగా ఉంటూ, పలువురు దర్శకులను నిశితంగా పరిశీలిస్తూ, అన్ని విభాగాలపై పట్టుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఫైట్ మాస్టర్స్ నుండి డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన వారెవ్వరూ దర్శకులుగా పూర్తిస్థాయిలో సక్సెస్ అయిన వారు అరుదు. మరి పీటర్ హెయిన్స్ ఈ చరిత్రను తిరగరాస్తాడేమో చూడాలి..!