Advertisementt

శ్రుతిహాసన్ పై కేసు ఎందుకు..?

Fri 27th Mar 2015 11:34 AM
sruthihasan,picture house media,court,civil,criminal actions  శ్రుతిహాసన్ పై కేసు ఎందుకు..?
శ్రుతిహాసన్ పై కేసు ఎందుకు..?
Advertisement
Ads by CJ

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిల కాంబినేషన్ లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాయికగా నటించడానికి శ్రుతిహాసన్ అంగీకరించి పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ తో అగ్రిమెంట్ ను కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో షూటింగ్ లో పాల్గొనాల్సిన శ్రుతిహాసన్ ఇప్పటివరకు షూటింగ్ లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని శ్రుతిహాసన్ అతిక్రమించింది. ఇతర సినిమాల కమిట్మెంట్ ల కారణంగా డేట్లను అడ్జస్ట్ చేయలేకపోతున్నానని, ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ఈ మెయిల్ ద్వారా ప్రకటించింది. నిజానికి.. ఆమెతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే, ఆమెకు అనుకూలమైన డేట్లనే ఈ సినిమా కోసం తీసుకోవడం జరిగింది. అలాంటిది శ్రుతిహాసన్ షూటింగ్ సగం నుండి తప్పుకోవడంతో పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ కు కోట్లలో నష్టం వాటిల్లింది. దీంతో శ్రుతిహాసన్ కు వ్యతిరేకంగా సివిల్, క్రిమినల్ యాక్షన్లను తీసుకున్నారు. సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసును విచారించి ఈ కేసు పూర్తయ్యే వరకు శ్రుతిహాసన్ కొత్త సినిమాలకు సంతకం చేయకూడదని ఆర్డర్లు వేసారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ