Advertisementt

బాలయ్య హీరోయిన్ ఇకపై తెలుగులో నటించదట!

Sun 29th Mar 2015 05:39 AM
radhika apte,sensational comments,telugu cinema industry,balayya heroine  బాలయ్య హీరోయిన్ ఇకపై తెలుగులో నటించదట!
బాలయ్య హీరోయిన్ ఇకపై తెలుగులో నటించదట!
Advertisement
Ads by CJ

హిందీలో ఒక్క విజయం వచ్చిన వెంటనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేయడం హీరోయిన్లకు ఫ్యాషన్ అయ్యింది. ఈ లిస్టులో నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' హీరోయిన్ రాధిక ఆప్టే కూడా చేరింది. తెలుగు ఇండస్ట్రీలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అక్కడ మేల్ డామినేషన్ (పురుషాధిక్యత) ఎక్కువ. లొకేషన్లో హీరోయిన్లను అస్సలు పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేశారు. అక్కడి ప్రవర్తన భరించలేక తెలుగులో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. అని తాజాగా ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది.

రాధిక నటించిన తాజా హిందీ సినిమా 'హంటర్‌ర్‌ర్‌'. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు గుర్తింపు, అవకాశాలను తీసుకొచ్చింది. ఈ నేపధ్యంలో రాధిక చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీ వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి. హిందీలో విజయాలు వచ్చిన తర్వాత తెలుగును చిన్నచూపు చూడడం సరికాదని హితవు పలికారు. 'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నటిస్తున్న 'లయన్'లో కూడా రాధిక సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ