నేటి రోజుల్లో సినిమాలకు టైటిల్స్ పెట్టడం సులభం అయిపోయింది. ఏదైనా సినిమాలో ఓ డైలాగ్ బాగా పేలితే అదే డైలాగ్‌ను టైటిల్‌గా పెట్టడం.. లేదా ఏదైనా సినిమాలోని ఓ పాట బాగా హిట్టయితే ఆ పాటలోని బిట్‌ను టైటిల్‌గా వాడేసుకుంటున్నారు. ఇటీవల పూరీ`ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్’ చిత్రంలో ‘దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. దీంతో త్వరలో సుకుమార్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా
నటించే చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. సబ్జెక్ట్‌కు కూడా ఈ
టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఎక్కువ భాగం షూటింగ్ యూరప్ దేశాల్లో జరుగుతుందని సమాచారం.