Advertisementt

‘గబ్బర్‌సింగ్‌2’ లిస్ట్‌లోకి మరో దర్శకుడు..!

Mon 30th Mar 2015 09:48 PM
gabbar singh 2,dolly,gopala gopala,sampath nandi,bobby,pawan kalyan  ‘గబ్బర్‌సింగ్‌2’ లిస్ట్‌లోకి మరో దర్శకుడు..!
‘గబ్బర్‌సింగ్‌2’ లిస్ట్‌లోకి మరో దర్శకుడు..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్‌ 2’ తీయాలని ‘రచ్చ’ తర్వాత సుమారు 2 సంవత్సరాలు వెయిట్‌ చేసిన సంపత్‌నందికి అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అలాగే సంపత్‌నంది తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన దర్శకుడు బాబీకి కూడా అదే పరిస్థితి ఎదురైనట్లుగా తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినబడుతున్నాయి. బాబీ కూడా ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడంతో, మరి ‘గబ్బర్‌సింగ్‌ 2’ని ఎవరు తెరకెక్కిస్తారనేదానిపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీ చేరినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే డాలీతో ఓ సినిమా చేస్తానని పబ్లిక్‌గా చెప్పిన పవన్‌..ఈ అవకాశాన్ని డాలీకే ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ