Advertisementt

సత్యమూర్తి కొడుకుని అందరూ చూడొచ్చు!

Tue 31st Mar 2015 12:41 AM
son of satyamurthy,censor details,allu arjun,attarintiki daaredi,trivikram srinivas  సత్యమూర్తి కొడుకుని అందరూ చూడొచ్చు!
సత్యమూర్తి కొడుకుని అందరూ చూడొచ్చు!
Advertisement
Ads by CJ

‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ రూపొందించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సోమవారం(30) సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌తో అందరూ చూసే చిత్రంగా గుర్తింపుని వేయించుకుంది. అంతేకాదు, ఈ చిత్రం చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి గురించి అద్భుతంగా చెప్పడం విశేషం. ముఖ్యంగా నిత్యామీనన్‌కి ఈ చిత్రం మరో అవార్డ్‌ని తెచ్చిపెడుతుందని అంటున్నారు. అంతలా ఈ చిత్రంలో ఆమె నటన ఉంటుందని సెన్సార్‌ సభ్యులు బయటపెట్టారు. సెన్సార్‌ సభ్యుల నుండి ఇంతటి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో.., ఈ సినిమా మరో అత్తారింటికి దారేదిగా బాక్సాఫీస్‌ వద్ద నిలబడుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ