Advertisementt

మహేష్ బాబు లో మార్పు మొదలైంది!

Tue 31st Mar 2015 04:37 AM
mahesh babu,remuneration,mythri movies,koratala siva  మహేష్ బాబు లో మార్పు మొదలైంది!
మహేష్ బాబు లో మార్పు మొదలైంది!
Advertisement
Ads by CJ

'1 నేనొక్కడినే', 'ఆగడు' సినిమాల తర్వాత మహేష్ బాబు ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గతంలో తన పని(నటించడం) మాత్రమే చూసుకునే మహేష్, నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్నాడు. '1 నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలకు 70 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. నిర్మాణ వ్యయం పెరగడమే దీనికి కారణం అని గ్రహించిన మహేష్, మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు. నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాడు. అప్పట్లో కృష్ణ కూడా ప్లాపులు ఎదురైనప్పుడు పారితోషకం తగ్గించుకున్న సందర్భాలు ఉన్నాయి. తండ్రి కృష్ణ అడుగుజాడల్లో నడుస్తున్నాడనమాట.    

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా కాలం తర్వాత వీరు నిర్మాణంలోకి ఎంటరయ్యారు. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను మహేష్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు వినికిడి. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ