Advertisementt

కాజల్ పై కోపంగా ఉన్న స్టార్ హీరో..!

Tue 31st Mar 2015 06:58 AM
kajal agarval,telugu star heroin,mari movie,dhanush  కాజల్ పై కోపంగా ఉన్న స్టార్ హీరో..!
కాజల్ పై కోపంగా ఉన్న స్టార్ హీరో..!
Advertisement
Ads by CJ

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. కానీ తమిళంలో మాత్రం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన 'మారి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం కాజల్ పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయగా ప్రొడ్యూసర్ ఆమె అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ధనుష్, 'మారి' చిత్ర బృందమంతా కాజల్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారట. దానికి కారణం అనుకున్న సమయానికి కాజల్ షూటింగ్ కు హాజరవ్వకపోవడం, ఇచ్చిన కాల్షీట్స్ డేట్స్ మార్చడం వంటి పనులు చేస్తోందట. దీంతో 'మారి' టీం అంతా కాజల్ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ధనుష్ అయితే కాజల్ పై విపరీతమైన కోపంతో ఆమెపై  నిర్మాత మండలి కి ఫిర్యాదు కూడా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ