మంచు మనోజ్ నటించిన 'పోటుగాడు' చిత్రం ద్వారా దర్శకునిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ డైరెక్టర్ పవన్ వడియార్. రీసెంట్ గా పవన్ వడియార్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆయన రజనీకాంత్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ వడియార్ రజనికి కథ వినిపించారని దానికి రజని ఓకే అన్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'లింగ' సినిమా తరువాత చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంలో రజని ఉన్నాడట. రజని కి 'రోబో' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన శంకర్ దానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట. మురుగదాస్ కూడా రజని కి కథ వినిపించాలని ట్రై చేస్తున్నాడట. శంకర్, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో కాకుండా పవన్ వడియార్ తో రజని సినిమా చేస్తే అధ్బుతమే అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు.