సినిమారంగంలో ఎవరైనా ఒకే హీరోయిన్‌తో రెండు మూడు చిత్రాలు చేస్తే వారిద్దరి మధ్య ఎఫైర్లు జోడిరచి ప్రచారం చేయడం మామూలే. కానీ వీటికి గట్టిగా సమాధానం చెప్పకుండా చాలామంది అలాంటివి పట్టించుకోరు. దాంతో అందరూ అదే నిజం అనుకుంటారు. కానీ ప్రతి విషయంలోనూ తనలోని స్పెషల్ ఐడెంటిటీని కాపాడుకునే నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల తనపై వస్తున్న పుకార్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. తాను తీసిన ‘అవును, లడ్డూబాబు, అవును2’.. ఇలా తన మూడు చిత్రాల్లో హీరోయిన్ పూర్ణకు అవకాశం ఇచ్చాడు రవిబాబు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు హల్‌చల్ చేశాయి. రవిబాబు`పూర్ణలకు లింకు పెడుతూ హాట్‌హాట్ గాసిప్స్ పుట్టేశాయి. వీటికి రవిబాబు ధీటుగా సమాధానం ఇచ్చాడు. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. సినిమా పూర్తయ్యాక దాని గురించి ఆలోచించను. అందులో నటించిన నటీనటులతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను. కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడను. పూర్ణ మంచి నటి. ‘అవును’లో చాలా బాగా చేసింది. అందుకే అవకాశాలు ఇస్తున్నాను. గతంలో భూమికతో కూడా చిత్రాలు చేశాను కదా! అంటూ తనదైనశైలిలో పుకారురాయుళ్లకు చురక్కు వేశాడు. ఈ విధంగా తనపై వస్తున్న రూమర్లకు ధీటైన సమాధానం చెప్పాడు రవిబాబు.