Advertisementt

సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌....!

Sat 04th Apr 2015 11:22 AM
junior ntr,poorijagannath,sukumar,stylish look,  సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌....!
సరికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌....!
Advertisement
Ads by CJ

చాలాకాలంగా సినిమా సినిమాకి మేకోవర్‌తో కొత్త లుక్‌లో కనిపించకుండా అశ్రద్ద చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల వచ్చిన పూరీజగన్నాథ్‌ ‘టెంపర్‌’లో సరికొత్తగా కనిపించి అందరినీ అలరించాడు. తాజాగా ఆయన సుకుమార్‌తో చేసే సినిమాలో కూడా మరో విభిన్నమైన స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే ఆయన భారీగా గడ్డం, జుట్టు, మీసం పెంచుతూ కనిపిస్తున్నాడు. ఇటీవల తన అభిమానితో కలిసి దిగిన ఫొటోలో కూడా ఆయన ఎప్పుడు చూడని విధంగా సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. సరికొత్త హెయిర్‌స్టైల్‌ కోసం ఆయన కృష్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పూరీ లాగానే సుకుమార్‌ కూడా తన చిత్రాలలో విభిన్నమైన లుక్స్‌, క్యారెక్టరైజేషన్‌ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్‌ ఈ సరికొత్త అవతారంలో కనిపించడానికి కారణం అని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ఆయన అద్భుతమైన లుక్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ