Advertisementt

రాశి ఖన్నా ప్రేమలేఖల కహాని..!

Sun 05th Apr 2015 05:44 AM
rashi khanna,love letters,koncham touch lo vunte chepta,jil heroine  రాశి ఖన్నా ప్రేమలేఖల కహాని..!
రాశి ఖన్నా ప్రేమలేఖల కహాని..!
Advertisement
Ads by CJ

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రాశి ఖన్నా. 'జిల్'మనిపించే అందంతో నటనలో 'జోరు' చూపిస్తున్న రాశితో తెలుగు ప్రేక్షకులు ప్రేమలో పడిపోయారు. కుర్రాళ్ళు అయితే ఆమెకు ఊహల్లో ప్రేమలేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న రాశికు ప్రేమలేఖలు అంటే చాలా ఇష్టమట. వాటిని చదవడం అంటే ఇంకా ఇష్టమట. చిన్నతనంలో స్నేహితులతో కలిసి తమ వీధిలో ఉండే అన్ని లెటర్ బాక్సులు ఓపెన్ చేసి ప్రేమలేఖలను చదివేదంట. ఈ విషయాన్నీ 'కొంచం టచ్ లో ఉంటె చెప్తా' రియాలిటీ షోలో రాశి చెప్పింది. ఇంత అందమైన అమ్మాయికి ఎవరూ ప్రేమలేఖలు రాయలేదా, ప్రేమించాలేదా అనే సందేహం వచ్చిందా..? స్కూలింగ్ అప్పుడే మూడుసార్లు ప్రేమలో పడిందట. 9వ తరగతిలో ఒకబ్బాయి ప్రపోజ్ చేశాడంట. ఇప్పుడు ఎవరు బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ లేరట. 

'జిల్'తో విజయం అందుకున్న రాశి, ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'బెంగాల్ టైగర్'లో నటిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ