ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య చిత్రాలలో కలిసి నటించిన నాగ చైతన్య, సమంతల జోడి హిట్ పెయిర్ అనిపించుకుంది. తొలి రెండు చిత్రాలు హిట్ కావడంతో పాటు వీరి కెమిస్ట్రీ అదుర్స్ అనే టాక్ వచ్చింది. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలని తెలుగు సినీ ప్రేక్షకులు కోరుతున్నారు. వారి కోరిక త్వరలో నేరవేరబోతుందని సమాచారం.
'కార్తికేయ' దర్శకుడు చందు మొండేటితో నాగ చైతన్య చేయబోయే చిత్రంలో కథానాయికగా సమంత పేరును పరిశీలిస్తున్నారట. 'సన్నాఫ్ సత్యమూర్తి' మినహా సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. అందువల్ల, చైతు - చందుల చిత్రానికి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చైతు మీద ఫస్ట్ హీరో అనే ఇంప్రెషన్ కూడా ఉంది. అయితే, దర్శకనిర్మాతలు ఇతర కథానాయికల వైపు కూడా చూస్తున్నారని సమాచారం. చివరకు ఎవరు కన్ఫర్మ్ అవుతారో..?