Advertisementt

'బంగారం', 'విలన్' కి మద్య పోటీ..!

Sun 05th Apr 2015 08:34 AM
ok bangaram vs uttama villain,kamal haasan,maniratnam,april 17th  'బంగారం', 'విలన్' కి మద్య పోటీ..!
'బంగారం', 'విలన్' కి మద్య పోటీ..!
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ సినిమాతో పోటి ఎందుకని రెండు వారాలు ఆలస్యంగా రావడానికి మణిరత్నం రెడీ అయ్యాడు. ఏప్రిల్ 2వ తేదీన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'ఓకే బంగారం'ను విడుదల చేయాలని మణిరత్నం భావించారు. 'ఉత్తమ విలన్' చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తామని కమల్ ప్రకటించడంతో వెనక్కు వెళ్ళారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ 'ఉత్తమ విలన్' ఏప్రిల్ 17న థియేటర్లలోకి వస్తుంది. అదే రోజున తన చిత్రాన్ని కూడా విడుదల చేయక తప్పడం లేదు మణిరత్నంకు. ఏప్రిల్ 17న 'ఉత్తమ విలన్'తో 'ఓకే బంగారం' ఢీ కొట్టబోతుంది. 

తెలుగు, తమిళ భాషలలో మంచి క్రేజ్ ఉన్న రెండు భారీ  చిత్రాలు ఒకే రోజున విడుదలకు సిద్దమవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. థియేటర్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ఆ ఒక్క తేది తప్పిస్తే... మిగతా శుక్రవారాలు తెలుగు సినిమాలతో నిండిపోయాయి. నిర్మాతలకు కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ డేట్ కి తప్పక విడుదలచేయాల్సిన పరిస్థితి. అయితే 'ఉత్తమ విలన్' ఏప్రిల్ 17న విడుదల కావడం కూడా కష్టమే, వాయిదా పడుతుందని తాజాగా తెలుస్తుంది. అదే నిజమైతే 'ఓకే బంగారం' జాక్ పాట్ కొట్టినట్లే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ