Advertisementt

చిరు సాంగ్ పై మోజుపడ్డ అక్కినేని హీరో..!

Tue 07th Apr 2015 06:29 AM
naga chaithanya,chiranjeevi song remake,docheye movie  చిరు సాంగ్ పై మోజుపడ్డ అక్కినేని హీరో..!
చిరు సాంగ్ పై మోజుపడ్డ అక్కినేని హీరో..!
Advertisement
Ads by CJ

‘స్వామిరారా’ ఫేమ్‌ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య, కృతిసనన్‌లు జంటగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచెయ్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని దానికి కారణాలు సైతం చెప్తున్నారు. దోచెయ్‌’ టైటిల్‌లో ‘దో’, ‘చేయ్‌’ కలిపి రాసినా రెండింటికి మద్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు గమనించవచ్చు. ‘దో’ అంటే ఇద్దరు అని కూడా అర్థం కాబట్టి ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయంచేస్తున్నాడనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి నటించిన సంఘర్షణ సినిమాలోని హిట్ సాంగ్ 'కట్టు జారి పోతావుందే' పాటను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. అయితే సినిమాలో ఇది బిట్ సాంగ్ గానే ఉంటుందట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఏప్రిల్‌24 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున ‘దోచెయ్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ