విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ క్రేజ్ ఇమేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో కమల్ హాసన్. తను నటించిన 'విశ్వరూపం' సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా కొందరి మనోభావాలు దెబ్బతినేలా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ చిత్రాన్ని నిలిపివేసే ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన నటించిన 'ఉత్తమ విలన్' సినిమాను కూడా బ్యాన్ చేయాలని విశ్వ హిందూ పరిషద్ నేతలు చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ పాటలో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు మధ్య జరిగే సంభాషణలో విష్ణుమూర్తిని దూషించి మాట్లాడినట్లు ఉంది. దీంతో ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటుందని భావించి కొందరు పోలీసులను ఆశ్రయించారు. మరి ఈ ప్రభావం 'ఉత్తమ విలన్' పై ఎంత వరకు ఉంటుందో చూడాలి..!