మెగా హీరోల సినిమా వేడుకలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా అభిమానులు పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయడం కంపల్సరీ. విజయవాడలో జరిగిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో సక్సెస్ మీట్లో సైతం పవన్ గురించి మాట్లాడాలంటూ అభిమానులు గోల గోల చేశారు. పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగు గొప్ప మాటలు చెప్పి అభిమానులను సంతోషపరిచాడు.
"నేను చూడడానికి ఇంతే.. కానీ తలెత్తితే నాకు జాతీయ జండాకు ఉన్నంత పొగరు ఉంటుంది. " ఇదే పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావంలో పవన్ చెప్పిన నాయకుడు కథను మరోసారి త్రివిక్రమ్ చెప్పారు. "ఓ నాలుగు అడుగుల ముందు నడుస్తూ గుంపును నడిపించే నాయకుడు పవన్ కళ్యాణ్" అంటూ అభివర్ణించారు. ఇష్టమైన మిత్రుడిని ఆకాశానికి ఎత్తేశాడు.
అభిమానుల స్పందన ఈ స్థాయిలో ఉంటుందని పవన్ కళ్యాణ్ కు తెలియదట. ఎందుకంటే, పవన్ అసలు టీవీ చూడరని త్రివిక్రమ్ తన స్పీచ్ చివర్లో సెలవిచ్చారు.