Advertisementt

అఖిల్ బర్త్ డేకు నితిన్ గిఫ్ట్ రెడీ!

Tue 07th Apr 2015 08:10 AM
akhil birthday,nithin gift,akhil movie teaser,vv vinayak  అఖిల్ బర్త్ డేకు నితిన్ గిఫ్ట్ రెడీ!
అఖిల్ బర్త్ డేకు నితిన్ గిఫ్ట్ రెడీ!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ అభిమానులకు పుట్టినరోజు కానుకను రెడీ చేశారు యువహీరో నితిన్. హీరోగా అఖిల్ పరిచయ చిత్రాన్ని నితిన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రేపు, ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్టు నితిన్ తెలిపారు. పసి వయసులో 'సిసింద్రీ'గా అలరించిన అఖిల్, 'మనం'లో తళుక్కున మెరిశాడు. పూర్తిస్థాయి కథానాయకుడిగా అఖిల్ తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.        

'సోషియో ఫాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమకథ ఇది. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని దర్శకుడు తెలిపారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేషా సెహగల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై తండ్రి సుధాకర్‌ రెడ్డితో కలిసి నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని రోజులు చిత్రీకరణ జరిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ