Advertisementt

మంచులక్ష్మి ఇలాంటిదా...!

Wed 08th Apr 2015 09:09 AM
manchu lakshmi,budugu movie,promotion,dongata movie  మంచులక్ష్మి ఇలాంటిదా...!
మంచులక్ష్మి ఇలాంటిదా...!
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ నుండి వచ్చి నటిగా, నిర్మాతగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న డైనమిక్ లేడీ మంచు లక్ష్మి. ఇప్పుడు సింగర్ గా కూడా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సినిమాలకే అంకితం అవ్వకుండా సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ఉండే మంచు లక్ష్మి ఇటీవల జరిగిన 'మా' ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే ప్రస్తుతం మంచు లక్ష్మి పై ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.  తను నటించే సినిమాలకు ఒక లాగా తన సొంత బ్యానర్ లో నటించే సినిమాలకు ఒక లాగా మంచులక్ష్మి వ్యవహరిస్తుందనేదే ఆ హాట్ న్యూస్. 

వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జరిగిన 'బుడుగు' సినిమా ప్రమోషనల్ లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంచు లక్ష్మి హాజరు కాలేదు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. బుడుగు సినిమా షూటింగ్ లో అనుకున్న సమయానికి హాజరవ్వకపోవడం వల్ల ఆ సినిమా డిలే అవ్వడానికి కారణమైన మంచు లక్ష్మి, తన వల్ల మరికొన్ని రోజులు షూటింగ్ కు రెమ్యునరేషన్ ఎక్స్ ట్రా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిందట. అందువల్లే బుడుగు ప్రమోషన్ ను లైట్ తీసుకుంటుందట. ఇది ఇలా ఉంటే తన సొంత బ్యానర్ లో చేస్తున్న 'దొంగాట' చిత్రానికి మాత్రం.. విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలు పెట్టేసింది. దీంతో మంచులక్ష్మి తనకి ఒకలా.. మరొకరికి మరోలా.. వ్యవహరిస్తుందని హాట్ హాట్ గా చెప్పుకుంటున్నారు..!

 

 

 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ