‘చిన్నదాన నీకోసం’ విడుదలై మూడు నెలలు గడుస్తున్న నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రమేది సెట్స్‌మీద లేదు. ఇప్పటి వరకు అధికారికంగా నితిన్ తదుపరి చిత్రం కూడా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం నితిన్ నిర్మాతగా బిజీగా వున్నాడు. అక్కినేని అఖిల్‌తో ఆయన నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నితిన్ హీరోగా సినిమా చేయడని ఫిల్మ్‌నగర్ సమాచారం. అఖిల్‌తో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట నితిన్. అంతేకాదు అఖిల్ కూడా ఈ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా మొదలుపెట్టవద్దని నితిన్‌కు చెప్పాడని అంటున్నాయి సినీ వర్గాలు.