Advertisementt

త్రిష స్థానంలో తాప్సీ..!

Thu 09th Apr 2015 04:57 AM
journey fame jai,trisha,tapsee replaces trisha,varun maniyan,  త్రిష స్థానంలో తాప్సీ..!
త్రిష స్థానంలో తాప్సీ..!
Advertisement
Ads by CJ

'జర్నీ' ఫేం జై హీరోగా తిరు దర్శకత్వంలో త్రిష కాబోయే భర్త, నిర్మాత వరుణ్ మణియన్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జై సరసన త్రిష నటిస్తుందని మొదట ప్రకటించారు. ఇతర చిత్రాల బిజీ షెడ్యూల్స్ కారణంగా కాల్‌షీట్స్ అడ్జస్ట్ చేయలేక త్రిష ఈ చిత్రం నుండి తప్పుకుంది. 

త్రిష స్థానంలో తాప్సీని కథానాయికగా తీసుకున్నారు. ఈ వార్తను దర్శకుడు తిరు దృవీకరించారు. కుంబకోణం నగర నేపధ్యంలో ఈ చిత్ర కథ జరుగుతుంది. తాప్సీ సిటీ గర్ల్ పాత్రలో కనిపిస్తుంది. ఏప్రిల్ నెలాఖరున కుంబకోణంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. తాప్సీ కూడా షూటింగులో పాల్గొంటుందని దర్శకుడు తిరు మీడియాకు తెలిపారు.

ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో పెద్దన్నయ్య పాత్రలో కనిపిస్తారు. తమన్ సంగీత దర్శకుడు. సుశాంత్ ప్రసాద్, వరుణ్ మణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ