Advertisementt

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి ఆనందకరమైన రోజు!

Thu 09th Apr 2015 05:35 AM
april 9,lion movie,son of satyamurthy,mega fans,nandamuri fans,happiest day  మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి ఆనందకరమైన రోజు!
మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి ఆనందకరమైన రోజు!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యాన్స్‌కి, నందమూరి ఫ్యాన్స్‌కి ఒకే రోజు ఆనందకరమైన రోజు రావడం నిజంగా విశేషమే మరి. గత కొద్ది కాలంగా ఇటువంటి అరుదైన సంఘటన జరిగింది లేదు. అందుకే ఈ రోజుని ఇరు వర్గాల ఫ్యాన్స్‌ సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇంతకీ ఆ రోజు ఏమిటనుకుంటున్నారు. ఏప్రిల్‌ 9.

విషయంలోకి వస్తే ఏప్రిల్‌ 9 మెగా ఫ్యాన్స్‌కి ఎలా ఆనందకరమైన రోజు అంటే.. అల్లు అర్జున్‌ నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రం ఇదే తేదీన ప్రపంచవ్యాప్తంగా, రికార్డు ధియేటర్లలో రిలీజవుతుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి డైరెక్టర్‌ అవ్వడంతో..చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం టాక్‌ కనుక పాజిటివ్‌గా వస్తే..ఇంక మెగాఫ్యాన్స్‌ని పట్టుకోవడం సాధ్యం కాదు. 

ఇక నందమూరి ఫ్యాన్స్‌ విషయానికి వస్తే..తమ నందమూరి నాయకుడు, నటసింహం బాలయ్య నటించిన ‘లయన్‌’ చిత్ర ఆడియో ఇదే తేదీన విడుదల కానుంది. రాజకీయాల అనంతరం బాలయ్య చేస్తున్న సినిమా ఇదే కావడంతో పాటు, ట్రైలర్స్‌లో బాలయ్య ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌ కనిపిస్తుండటం, తన నట బిరుదుతో ఉన్న టైటిల్‌ కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను కారణమవుతోంది. ఏప్రిల్‌ 9న విడుదల అయ్యే పాటలు కూడా సక్సెస్‌ అయితే..బాలయ్య లిస్ట్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ పడటం ఖాయం అన్నట్లుగా నందమూరి ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. సో..ఈ విధంగా మెగా, నందమూరి ఫ్యాన్స్‌ హ్యాపీగా చెప్పుకునే తేదీగా ఏప్రిల్‌ 9 విశేషాన్ని సంతరించుకుంది.