Advertisementt

రీరిలీజ్ కు అంత ఖర్చా..!

Fri 10th Apr 2015 01:54 AM
siva movie,re release,digital technology,re master print  రీరిలీజ్ కు అంత ఖర్చా..!
రీరిలీజ్ కు అంత ఖర్చా..!
Advertisement
Ads by CJ

'శివ' అనే ఓ బ్లాక్ బాస్టర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 1989 లో వచ్చిన ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టింది. తెలుగు సినిమాకు కొత్త అర్ధం చెప్పి చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మరలా ఆ సినిమాను రీరిలీజ్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ లోకి మార్చి రీ మాస్టర్ ప్రింట్ తో విడుదల చేయనున్నారట. శివ సినిమాలో అన్ని విభాగాల్లో కొత్తగా మార్పులు చేసి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా రీమాస్టర్ ప్రింట్ చేయడానికి సుమారుగా నాలుగు నుండి ఐదు కోట్ల వరకు ఖర్చుపెట్టారని సమాచారం. డబ్బు కోసం కాకుండా ఓ మంచి జ్ఞాపకంగా ఈ చిత్రం మిగిలిపోవాలని భావిస్తున్నారట. వంద థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేసినా.. ప్రస్తుతం మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ