బాలీవుడ్ బ్యూటీ కంగనరనౌత్ అందంలోను, నటనలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తను నటించిన 'క్వీన్' సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు అందుకుంది. అయితే ఇటీవల జరిగిన 'ది ఫ్రమ్ రో: కాన్వర్సేషన్స్ ఆఫ్ సినిమా' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కంగన సినిమా మీడియాను తీవ్రంగా దూషించింది. అసలు మీడియా కు యాడ్స్ ఎందుకు ఇవ్వాలి, రివ్యూ లను కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. సినిమా నిర్మాతలు అనవసరంగా ఇలా డబ్బు వృదా చేయకుండా సినిమా క్వాలిటీ పెంచడానికి ఉపయోగిస్తే మంచిది అని తన కోపాన్ని వెల్లడించింది.
మీడియా ఇలా ప్రవర్తిస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏమవుతుంది..? పెయిడ్ మీడియా.. ప్రతి దానికి డబ్బు ఇవ్వాల్సిందే అని ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. అయితే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో చిన్న పట్టణం నుండి వచ్చిన ఈ భామ టాలెంట్ ను పొగుడుతూ రాసిన కథనాలను, జాతీయ స్థాయిలో అవార్డు అందుకుందని ఆకాశానికేత్తేసిన మీడియాను మరచిపోయి ఇలా తిట్టడంతో బాలీవుడ్ మీడియా షాక్ అయింది.