తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం ఆయన 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న '24' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే అమెరికన్ టీవీ సీరీస్ ‘24' హక్కులను ట్వంటీన్త్ సెంచరీ ఫాక్స్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కొనుగోలు చేసారు. హిందీ బాషలో వివిధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు ఆయన ఈ హక్కులు పొందారు. ఇప్పటికే ఫస్ట్ సీజన్ ఓ ప్రముఖ హిందీ ఛానల్ లో ప్రసారం అవుతోంది.
అయితే సూర్య నటిస్తున్న ఈ సినిమా టైటిల్ అనిల్ కపూర్ కొనుగోలు చేసిన లోగో ఒకలా ఉండడంతో అనిల్ కపూర్ సూర్యకు ఫోన్ చేసి టైటిల్ మార్చమని చెప్పాడట. దానికి సూర్య మా టీమ్ తో మాట్లాడి చెప్తానన్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం సినిమా టైటిల్ విషయం లో కాంప్రమైస్ అవ్వకపోతే అనిల్ కపూర్ లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.