ఇటీవల ఎక్కువగా యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న మంచు మనోజ్... త్వరలో పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో నటించడానికి సన్నద్ధం అయ్యాడు. కుటుంబంలో సంతోషాలు, సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై అందంగా ఆవిష్కరిస్తాడని పేరు తెచ్చుకున్న దశరధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దశరధ్ చెప్పిన కథ హీరోకు నచ్చింది. దర్శకుడి గత సినిమాల తరహాలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. 10 సంవత్సరాల తర్వాత మనోజ్, దశరధ్ కలిసి సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో 'శ్రీ' వచ్చింది.
మనోజ్ పెళ్లి తర్వాత దశరధ్ సినిమా ప్రారంభమవుతుంది. మధ్యలో దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్క్రిప్ట్ మీద దృష్టి పెడతారు. ప్రస్తుతం మంచు మనోజ్, వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎటాక్' సినిమా షూటింగ్ పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు.