రైతులకు అండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్దమని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో పవన్ మరోసారి గళం విప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించడానికి సిద్దమవుతున్నట్టు రాష్ట్ర హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలియజేసినట్టు నేడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఉద్దేశంలో ముందుకు వెళితే రైతులకు అండగా పోరాటం చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను. అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.
రైతులతో ఇప్పటికే ఒకసారి పవన్ సమావేశం అయ్యారు. తుళ్ళూరు పరిసర రాజధాని ప్రాంతాలలో పవన్ పర్యటన, ఆ పర్యటనలో చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు విమర్శలు చేశారు. పవన్ ద్వందవైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికలలో పవన్ చంద్రబాబు, మోడీలకు పవన్ మద్దతు ప్రకటించిన సంగతి విదితమే. పవన్ విషయంలో వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎలా స్పందిస్తారో ..?