Advertisementt

కలిసిరాని రాజేంద్రుడు !

Sat 11th Apr 2015 03:42 AM
rajendra prasad,character artist,son of satyamurthy,julayi  కలిసిరాని రాజేంద్రుడు !
కలిసిరాని రాజేంద్రుడు !
Advertisement
Ads by CJ

నిన్నటితరం కామెడీ స్టార్‌ రాజేంద్రప్రసాద్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆయన చేసిన, చేస్తున్న చిత్రాలు ఎక్కువ శాతం పరాజయం పాలవుతుండటంతో ఆయన నిరాశకు లోనవుతున్నాడని తెలుస్తోంది. ఆయన ఇలా చేసిన ‘బావ, మొగుడు, నిప్పు, ఆగడు.. వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఒకేఒక్క ‘జులాయి’ మాత్రం మంచి విజయం సాధించింది.

తాజాగా  ఆయన మరోసారి ‘జులాయి’ టీమ్‌తో చేసిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ప్రస్తుతం డివైడ్‌టాక్‌తో నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చిత్రాన్ని హిట్టు లేదా ఫ్లాప్‌ అని  తేల్చడం కష్టమని, సోమ, మంగళవారాల్లో ఈ చిత్రం సాధించే కలెక్షన్లపైనే ఈ చిత్రం ఏ రేంజ్‌ చిత్రమో డిసైడ్‌ చేయవచ్చని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మరి రాజేంద్రునిపై వచ్చిన బ్యాడ్‌ సెంటిమెంట్‌ తప్పు అని తేలాలంటే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సాధించే ఫలితం మీదనే ఆధారపడి ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ