Advertisementt

పోసాని సెటైర్లు ఎవరిని ఉద్దేశించి!?

Sun 12th Apr 2015 01:20 PM
posani krishna murali,dohchay,bandla ganesh,controversy comments  పోసాని సెటైర్లు ఎవరిని ఉద్దేశించి!?
పోసాని సెటైర్లు ఎవరిని ఉద్దేశించి!?
Advertisement
Ads by CJ
పోసాని కృష్ణమురళి... టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఏదైనా సరే ముక్కుసూటిగా, మొహమాటాలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. కాగా ఇటీవల జరిగిన ‘దోచెయ్‌’ ఆడియో వేడుకలో ఆయన నిర్మాతలపై కొన్ని సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మాట్లాడుతూ....లక్ష రూపాయలు జేబులో పెట్టుకొన్న ప్రతివాడు నిర్మాత అయిపోతున్నాడని, వాళ్ల వల్ల నిర్మాతలందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్మాత అనే పదానికి మీనింగ్‌ లేకుండా పోయిందని, ఎవరు పడితే వారు నిర్మాతలైపోవడం వల్ల ఆర్టిస్టులకు ఇబ్బందులు  తప్పడం లేదని, పారితోషికం ఎవరు ఇస్తాడో.. ఎవరు ఎగ్గొడతారో అర్థంకావడం లేదని విరుచుకుపడ్డాడు. ఈమధ్యకాలంలో పోసాని కమర్షియల్‌గా బాగా క్లిక్కయి, బిజీ ఆర్టిస్ట్‌ అయిపోయాడు. రచయితగా ఎంత సంపాదించాడో తెలియదుకానీ, నటునిగా మాత్రం బాగానే కూడబెట్టాడు. రోజుకి లక్షరూపాయలు తీసుకునే రేంజ్‌కు చేరాడు. మరి ఈయన పారితోషికం ఎవరు ఎగ్గొట్టారు?  ఆయన కడుపుమంట ఎవరి మీద? అనేది ఫిల్మ్‌నగంలో హాట్‌టాపిక్‌గా మారింది. 
ఫిల్మ్‌నగర్‌ సమాచారం ప్రకారం ‘టెంపర్‌’ చిత్ర విజయంలో కీలకపాత్ర నారాయణమూర్తిగా, సిన్సియర్‌ పోలీస్‌గా అదరగొట్టిన ఈయనకు నిర్మాత బండ్ల గణేష్‌ పారితోషికం కొంత మాత్రమే ఇచ్చి. మిగతా మొత్తాన్ని ఇవ్వలేదని, పూరీతో పాటు హీరో ఎన్టీఆర్‌కు కూడా ఆయన పారితోషికం మొత్తం ఇవ్వలేదని, ఆ కోవలోనే ఆయన పోసానికి కూడా ఎగ్గొటడం వల్ల నిర్మాత బండ్లగణేష్‌ను ఉద్దేశించే ఆయన విరుచుపడ్డాడని విశ్వసనీయ సమాచారం.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ