సన్నీ లియోన్ నటించిన తాజా సినిమా 'ఏక్ పహేలి లీలా' సినిమాకు విమర్శకుల నుండి దారుణమైన రివ్యూలు వచ్చాయి. చిట్టిపొట్టి బట్టల్లో సన్నీ లియోన్ సెక్సీ షో చేయడం మినహా, సినిమాలో సరుకు లేదు. ప్లాప్ అని తేల్చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తుంది. తొలిరోజు 5.3 కోట్ల రూపాయలు వసూలు చేసి సన్నీ స్టార్ పవర్ చాటి, విమర్శకులను ఆశ్చర్యపరిచింది.
2015లో విడుదలైన అమితాబ్ బచ్చన్(షమితాబ్), బిపాసా బసు(ఎలోన్), సొనమ్ కపూర్(డోలి కి డాలీ), అనుష్క(ఎన్.హెచ్.10) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ మూడున్నర కోట్లలోపే. కేవలం సన్నీ అందాలపై ఆధారపడ్డ ఈ సినిమాకు 5కోట్లు రావడం విశేషమే. వసూళ్ళ పట్ల దర్శక నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. సినిమాకు కాసులు రాల్చడంలో సన్నీ క్రేజ్ ముందు వారి స్టార్ స్టేటస్, ఇమేజ్ దిగదుడుపే.
ఓ సినిమాలో సన్నీ లియోన్ ఉందంటే.. ఆమెను చూడడం కోసం వస్తారు గానీ, కథేంటో ఆలోచిస్తారా..? చెప్పండి. చిత్ర బృందం ఊహించినట్టు ఈ సినిమాకు సింగల్ స్క్రీన్ థియేటర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.