Advertisementt

వర్మ ఈ సినిమా ని ఎప్పుడు తీశాడు!

Wed 15th Apr 2015 04:15 AM
ram gopal varma,sachin joshi,sampoornesh babu  వర్మ ఈ సినిమా ని ఎప్పుడు తీశాడు!
వర్మ ఈ సినిమా ని ఎప్పుడు తీశాడు!
Advertisement
Ads by CJ

సినిమాను ఎప్పుడు సెట్‌ చేస్తాడో, ఎప్పుడు మొదలుపెడతాడో తెలియకుండా ఒక్కసారిగా షూటింగ్‌ మొదలుపెట్టి పూర్తి చేసిన తర్వాత మీడియా ముందుకు రావడం విలక్షణ, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అలవాటు.  తాజాగా ఆయన ఇలా మరో షాక్‌ ఇచ్చాడు. తెలుగు, హిందీ భాషల్లో సచిన్‌జోషి హీరోగా వర్మ తీసిన చిత్రం ఆల్‌రెడీ ఒక్కపాట మినహా పూర్తయిందని, ఈ చిత్రాన్ని మే15న విడుదల చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. వర్మ గత చిత్రాలకంటే ఈ చిత్రం కొంత భారీ బడ్జెట్‌తోనే రానుందని సమాచారం. మరోవైపు వర్మ బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబుతో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రం హర్రర్‌ చిత్రాలకు స్నూప్‌గా ఉంటుందని, ఇంతకాలం కామెడీ పేరడీలే చూసిన మనకు హర్రర్‌ పేరడి సరికొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో వర్మ ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేసాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ