Advertisementt

కాజోల్‌కు భారీ ఆఫరే ఇచ్చారు..!!

Wed 15th Apr 2015 08:17 AM
kajol,dilwalhe,rohith shetty,remunaration,sharukh  కాజోల్‌కు భారీ ఆఫరే ఇచ్చారు..!!
కాజోల్‌కు భారీ ఆఫరే ఇచ్చారు..!!
Advertisement
Ads by CJ

      బ్లాక్‌ బ్యూటీ కాజోల్‌.. కొన్నేళ్లపాటు బాలీవుడ్‌ను ఏలింది. అందునా షారూక్‌ఖాన్‌, కాజోల్‌ జోడీకి హిందీలో చాలా క్రేజ్‌ ఉంది. వారి కాంబినేషన్‌లో వచ్చిన బాజీగర్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే, కుచ్‌ కుచ్‌ హోతాహై తదితర చిత్రాలు బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచాయి. ఇక పెళ్లి తర్వాత ఈ భామ సినిమాలకు పూర్తిగా పులిస్టాప్‌ పెట్టింది. కాస్త బొద్దుగా కూడా తయారైన ఈ భామ రీఎంట్రీకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే మళ్లీ ఆమె షారూక్‌ సరసన ఓ సినిమా చేయబోతోంది.  షారూక్‌కు 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' లాంటి భారీ విజయాన్ని అందించిన రోహిత్‌షెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'దిల్‌వాలే' సినిమాలో షారూక్‌, కాజోల్‌ మళ్లీ కలిసి నటించనున్నారు. ఇది పాత విషయమే అయినప్పటికీ ఈ సినిమా కోసం కాజోల్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 'దిల్‌వాలే' సినిమా కోసం కాజోల్‌ అక్షరాల ఐదుకోట్ల రూపాయల పారితోషకం అందుకోనుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్రతారాలుగా చెలామణి అవుతున్న కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌ల స్థాయిలో ఈ అమ్మడు పారితోషకం తీసుకుంటుండటం సంచలనంగా మారింది. లేట్‌ ఏజ్‌లో కూడా కాజోల్‌కు భారీ ఆఫరే దక్కిందని బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇక వచ్చే క్రిస్‌మస్‌కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ