స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ఇప్పటికే తన కిందటి చిత్రం ‘రేసుగుర్రం’ ద్వారా 50కోట్ల క్లబ్బులో చేరాడు. అయితే ఆ చిత్రానికి కేవలం 40కోట్లకు మాత్రమే అమ్మడం వల్ల నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా బాగానే లాభాలొచ్చాయి. అయితే బన్నీ తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని ఏకంగా 60కోట్ల దాకా అమ్మడం వల్ల ఇప్పుడు పంపిణీదారులకు నష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడిరది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం ఖచ్చితంగా 50కోట్ల క్లబ్బులో చేరుతుందని, ఆవిధంగా చూస్తే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బన్నీ వరుసగా రెండు చిత్రాలతో 50కోట్లను దాటే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 50కోట్ల క్లబ్బులో చేరినప్పటికీ ఈ చిత్రం బన్నీని అసంతృప్తికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్‌వర్గాల సమాచారం ప్రకారం..‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం కనీసం 60కోట్లకు పైగా వసూలు చేస్తే తప్ప పంపిణీదారులకు లాభాలు రావని, ఈ చిత్రం 60కోట్లు వసూలు చేసే అవకాశం లేకపోవదడం వల్ల ఈ చిత్రం కొన్నవారికి నష్టాలు తప్పవని, అందువల్ల ఈ చిత్రం ఏవిధంగా చూసుకున్నా, నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా అందరికీ అసంతృప్తిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.