ఎన్టీఆర్ భలే మంచి డాన్సర్ అని అందరూ ఒప్పుకొంటారు. చిన్నప్పటి నుండి సంప్రదాయ నృత్యాలు అభ్యసించిన ఆయన సినిమాల్లో ఎలాంటి క్లిష్టతరమైన మూమెంట్స్‌ను కూడా అదుర్స్ అనేలా చేస్తాడు. అలా సునాయాసంగా చేయడమే కాదు.. ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ నృత్యప్రధానమైన చిత్రంలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం అది జయాపజయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మరపురాని చిత్రంగా మిగిలిపోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.