Advertisementt

ఇక్కడ మహేష్ బాబు, అక్కడ విశాల్!

Thu 16th Apr 2015 05:25 AM
mahesh babu,vishal,thums up,brand ambassador  ఇక్కడ మహేష్ బాబు, అక్కడ విశాల్!
ఇక్కడ మహేష్ బాబు, అక్కడ విశాల్!
Advertisement
Ads by CJ

ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ 'థమ్స్ అప్' బ్రాండ్ అంబాసిడర్‌గా తమిళ హీరో విశాల్ సంతకం చేశాడు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్ళుగా 'థమ్స్ అప్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. టీవీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లలో మహేష్, సల్మాన్ చేసే విన్యాశాలు ప్రేక్షకులను అలరించాయి. కూల్ డ్రింక్ సేల్స్ పెంచడంలో కృషి చేశారు. ఇప్పుడు విశాల్ వంతు వచ్చింది. 'థమ్స్ అప్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయడం పట్ల సోషల్ మీడియాలో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. చెన్నైలో 'థమ్స్ అప్' ప్లాంట్ సందర్శించిన విశాల్, త్వరలో యాడ్ షూటింగులో పాల్గొంటారు. బ్రాండ్ అంబాసిడర్‌గా విశాల్ సంతకం చేసిన మొదటి కంపెనీ 'థమ్స్ అప్' కావడం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ