టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2014కి గాను దగ్గుబాటి రానా మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన మహేష్‌బాబును వెనక్కినెట్టి తొలిస్థానం సాధించడం కొందరికి ఆనందాన్ని కలిగించింది. మహేష్‌బాబు కేవలం రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆ తర్వాత స్థానాల్లో ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్‌లు నిలిచారు. బన్నీకి 9వ స్థానం, 10వ స్థానంలో రామ్‌చరణ్, 11 వ స్థానంలో నాగచైతన్య, 12వ స్థానంలో నాగార్జున నిలిచారు. అయితే ఈ జాబితాలో పవన్‌కళ్యాణ్‌కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే పవన్ అభిమానులు మాత్రం దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు.అసలు తమ హీరోకు ఇలాంటివి ఇష్టం ఉండవని, ఇలాంటి సర్వేలు తాము పట్టించుకోమని చెబుతున్నారు. నిజమే ... ఈమధ్యకాలంలో సర్వేలకు,అవార్డులకు విలువ లేకుండా పోయిందనేది వాస్తవం....!