తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానులు ఉన్న స్టార్ అజిత్. ఆయన స్టైల్, లుక్స్‌కి అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అసలు తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకోనిదే బయటకు రాని వారిని ఎంతో మందిని చూస్తున్నాం. కానీ తనకున్న తెల్లజుట్టునే ఓ స్టైలిష్ ట్రెండ్‌గా మార్చిన ఘనత అజిత్‌దే. ఆయన 43ఏళ్ల వయసులో ఓ రేర్ ఫీట్ సాధించాడు. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మేన్‌గా 2013లో 5 వస్థానంలో ఉన్న అజిత్ 2014కు గాను మొదటిస్థానం దక్కించుకోవడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అజిత్ తర్వాతనే 2013లో ప్రధమ స్థానంలో ఉన్న ఆర్య, సూర్య, ధనుష్ వంటి వారు నిలిచారు. మొత్తానికి ఈ వయసులో కూడా అందరి చూపును తన వైపుకు తిప్పుకుంటున్న అజిత్‌కు తిరుగులేదనే చెప్పాలి...!