Advertisementt

'పండగ చేస్కో' పై షాకింగ్‌ న్యూస్‌!

Fri 17th Apr 2015 08:26 AM
hero ram,rakhul preeth singh,padaga chesko movie,z telugu,satellite rights  'పండగ చేస్కో' పై షాకింగ్‌ న్యూస్‌!
'పండగ చేస్కో' పై షాకింగ్‌ న్యూస్‌!
Advertisement
Ads by CJ
ప్రస్తుతం హీరో రామ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘పండగచేస్కో’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం గురించిన ఓ వార్త ఇప్పుడు హట్‌టాపిక్‌ అయింది. ఈ చిత్రం శాటిలైట్‌ బిజినెస్‌ జరిగిపోయిందని, జీ తెలుగు చానెల్‌ ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను 6కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. 6కోట్ల అంటే మామూలు విషయం కాదని, అందునా ఈమద్య రామ్‌ వరుస పరాజయాలతో ఫామ్‌లో లేడని, ఇలాంటి నేపథ్యంలో 6కోట్లు పెద్ద మొత్తమే అని అంటున్నారు. జీ తెలుగు చానెల్‌ వారు ఈ చిత్రం రషెస్‌ను చూసి ఇంప్రెస్‌ అయి ఇంత మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డారని అంటున్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ