Advertisementt

హీరోయిన్ల కంటే సానియా మీర్జా బెటర్..!

Sat 18th Apr 2015 05:37 AM
sania mirza,most desirable women of 2014,times of india,sriya saran  హీరోయిన్ల కంటే సానియా మీర్జా బెటర్..!
హీరోయిన్ల కంటే సానియా మీర్జా బెటర్..!
Advertisement
Ads by CJ

హైదరాబాదీలకు తెలుగు సినిమా హీరోయిన్లలో ఒక్కరు కూడా సానియా మీర్జా కంటే అందంగా కనిపించలేదు. హీరోయిన్ల కంటే సానియా మీర్జా బెటర్ అని తీర్పు ఇచ్చారు. హైదరాబాదీలను సానియా మీర్జా అంతగా ఆకర్షించింది. టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అఫ్ 2014గా హైదరాబాదీ పాఠకులు సానియా మీర్జాకు ఓటు వేశారు. సానియా తర్వాత ద్వితీయ స్థానంలో శ్రియ శరన్ నిలవడం గమనార్హం. ఆ తర్వాత అనుష్క, శృతి హాసన్, పూజా హెగ్దేలు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

ఒక క్రీడాకారిణి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో మొదటి స్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. గత ఏడాది సానియా మీర్జా 11వ స్థానంలో నిలిచింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, వరుస విజయాలు ఆమెను నెంబర్ వన్ చేశాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ