Advertisementt

కమెడియన్‌లా రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన! : జయసుధ

Sat 18th Apr 2015 08:47 AM
rajendra prasad,jayasudha,murali mohan,comedian,jayasudha about rajendra prasad  కమెడియన్‌లా రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన! : జయసుధ
కమెడియన్‌లా రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన! : జయసుధ
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా విమర్శల పర్వం కొనసాగుతుంది. మాటల యుద్దానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌పై విమర్శలు చేశారు. శుక్రవారం సైతం ఆర్టిస్టుల మధ్య వాతావరణం వేడిగానే ఉంది. 

"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా గెలుపొందిన రాజేంద్రప్రసాద్‌ను అభినందించాలని అనుకున్నాను. కానీ, ఎన్నికైన తర్వాత అతని ప్రవర్తన నన్ను భాదించింది. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి డిగ్నిటీగా ఉండాలి. నాపై ఎగతాళిగా మాట్లాడడం, ప్రకటనలు చేయడం సరికాదు. రాజేంద్ర ప్రసాద్ ఒక కమెడియన్, అతనింకా కమెడియన్‌లా ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల భవిష్యత్లో 'మా' నిర్వహించే కార్యక్రమాల్లో నేను భాగస్వామిని కావడం లేదు. కానీ, నాకు చేతనైనంత సహాయం చేస్తానని" జయసుధ పేర్కొన్నారు. ఓటమి పాలవడంతో నిరాశకు లోనుకాలేదు. ప్యానల్ నుండి 22 మంది సభ్యులు ఎన్నికవడం, మహిళా అభ్యర్ధిగా 150 ఓట్లు కైవసం చేసుకోవడంతో నైతికంగా విజయం సాధించినట్టు చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ