రెండు టాలీవుడ్ చిత్రాల్లో హీరోగా నటించిన ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అకారణంగా ఓ క్రీడాకారుడిపై దాడి చేయడమే కాకుండా హత్య చేస్తానని బెదిరించినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్, పరారే చిత్రాల్లో హీరోగా నటించిన ఉదయ్‌కిరణ్ గత నెలలో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి చూస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలై ఉదయ్‌కిరణ్ బయటకు వచ్చాడు. అయితే రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు ప్రవీణ్‌కుమార్‌పై ఉదయ్ దాడి చేసినట్లు సమాచారం. తాను డ్రగ్స్ తీసుకుంటానని పోలీసులకు సమాచారం అందించి తాను అరెస్టుకావడానికి ప్రవీణ్‌కుమారే కారణమంటూ ఆయన దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రవీణ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులను కూడా అంతం చేస్తానని ఉదయ్ బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఉదయ్‌ను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.