Advertisementt

చరణ్‌ నిరాకరించిన చిత్రం ఇదే!

Sun 19th Apr 2015 05:56 AM
ram charan,maniratnam,ok bangaram,mega power star,dulqur salman  చరణ్‌ నిరాకరించిన చిత్రం ఇదే!
చరణ్‌ నిరాకరించిన చిత్రం ఇదే!
Advertisement
Ads by CJ

కొద్దికాలం కిందట మణిరత్నం, సుహాసినిలు కలిసి రామ్‌చరణ్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకొని చరణ్‌కు ఓ స్టోరీ చెప్పారు. అయితే అందులో మాస్‌ ఎలిమెంట్స్‌ లేవని, తనకు, తన ఇమేజ్‌కు తగ్గ స్టోరీ కాదని చరణ్‌ నిరాకరించాడు. చిరంజీవి సూచన మేరకే చరణ్‌ ఆ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది మరేదో కాదు... ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో రూపొంది విడుదలైన ‘ఓకే బంగారం’ అని తెలుస్తోంది. మమ్ముటి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా రూపొందిన ఈ చిత్రం మంచి రొమాంటిక్‌ మూవీగా పేరు తెచ్చుకుంటోంది. చాలాకాలం తర్వాత ఈ చిత్రంతో మణిరత్నం విజయాన్ని అందుకున్నాడు. సహజీవనం, ప్రేమ అంశాలను బేస్‌గా తీసుకొని ఎంతో బ్యూటిఫుల్‌గా ఈ చిత్రాన్ని మణి తెరకెక్కించాడని ప్రశంసలు వస్తున్నాయి. యువతను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రాన్ని  వదులుకోవడం చరణ్‌ చేసిన మంచి పనా...?లేక ఆయన చేసిన తప్పిదమా..? అనే అంశంపై ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చ సాగుతోంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ