Advertisementt

ఆచితూచి అడుగులు వేస్తోన్న పవన్‌!

Sun 19th Apr 2015 11:13 AM
gabbar singh 2,pawan kalyan,bobby director,janasena,may 4,gabbar singh 2 details  ఆచితూచి అడుగులు వేస్తోన్న పవన్‌!
ఆచితూచి అడుగులు వేస్తోన్న పవన్‌!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించనున్న ‘గబ్బర్‌సింగ్‌2’కి సంబంధించిన ఏ  వార్త అయినా ఆయన అభిమానులకు ఆనందాన్నే కలిగిస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం మే 4 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ కొత్త అవతారంలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పవన్‌ బాడీలాంగ్వేజ్‌పై దర్శకుడు బాబీ దృష్టి పెట్టినట్లు సమాచారం. మెడపై చేయివేయడంతో పాటు నడక, హావభావాలు, స్టెప్స్, డైలాగ్‌ డెలివరీ వంటివి పవన్‌కు దేవుడిచ్చిన వరం. అయితే ప్రస్తుతం పవన్‌ కేవలం హీరో మాత్రమే కాదు.. ఓ రాజకీయపార్టీకి అధినేతగా ఆయన బాద్యతాయుతమైన వ్యక్తిగా మారాడు. కాబట్టే ఇంతకు ముందు పవన్‌ ఏమిచేసినా, ఎలా చేసినా,  ఏ డైలాగు చెప్పినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు...! కానీ ఇప్పుడు మాత్రం పవన్‌ సినిమాలో   ఏదైనా తేడా వస్తే.... విమర్శించడానికి ఎందరో ఎదురుచూస్తున్నారు. సో... అలాంటి విమర్శలకు తావివ్వకుండా తాను చెప్పే డైలాగుల నుండి మేనరిజమ్స్‌ వరకు వివాదం లేకుండా చూడాలని పవన్‌ బాబిని కోరిన వెంటనే ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు బాబికి పవన్‌ కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ