Advertisementt

నిత్యామీనన్‌కు పెరుగుతోన్న క్రేజ్‌!

Mon 20th Apr 2015 01:17 AM
nithya menen,ok bangaram,craze,nithya menen movie,number one heroine  నిత్యామీనన్‌కు పెరుగుతోన్న క్రేజ్‌!
నిత్యామీనన్‌కు పెరుగుతోన్న క్రేజ్‌!
Advertisement
Ads by CJ

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా కేవలం తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్‌ మలయాళ కుట్టి నిత్యామీనన్‌. ఆమెకు కేవలం గ్లామర్‌షో చేయకపోవడం అనే లోపం తప్ప ఇంకేమీ లేవు. కాగా ఇటీవల ఆమె ఓ హీరోయిన్‌గా నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఈ వారం ఆమె నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అవే ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం), లారెన్స్‌ నటించిన ‘కాంచన 2’. ఈ రెండు చిత్రాల్లో నిత్యా నటనకు ప్రేక్షకులు మంత్రముగ్దులవుతున్నారు. ‘కాంచన2’ చిత్రం మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తుంటే, ‘ఓకే బంగారం’ చిత్రం యువతను, క్లాస్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. ‘సఖి’ చిత్రంలో షాలిని తర్వాత అదే స్థాయిలో మణిరత్నం ‘ఓకే బంగారం’లో  నిత్యా పాత్రను తీర్చిదిద్దాడని విశ్లేషకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఒకే రోజున విడుదలైస రెండు చిత్రాలు పాజిటవ్‌ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమెకు ఎవరైనా స్టార్‌ హీరో ఆమెకు అవకాశం ఇస్తే మాత్రం ఆమె టాప్‌ హీరోయిన్‌గా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ