Advertisementt

త్రివిక్రమ్‌ కొత్త ట్రెండ్‌!

Mon 20th Apr 2015 01:56 PM
trivikram srinivas,new trend,trivikram new movie,jalsa movie,iliyana  త్రివిక్రమ్‌ కొత్త ట్రెండ్‌!
త్రివిక్రమ్‌ కొత్త ట్రెండ్‌!
Advertisement
Ads by CJ
దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘జల్సా’ చిత్రం నుండి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు ఏదో ఒక లోపం, లేదా వ్యాధిని చూపిస్తున్నాడు. ‘జల్సా’ చిత్రంలో ఇలియానాను బ్రెయిన్‌లెస్‌ బ్యూటీగా, ప్రతి విషయంలోనూ 10సెకన్లు ఆలస్యంగా స్పందించే సమస్యతో బాధపడుతున్నట్లు చూపాడు. అలాగే కంటి సమస్యతో కళ్ళజోడు కూడా ధరిస్తుంది. ‘ఖలేజా’ చిత్రంలో అనుష్కను ఐరన్‌లెగ్‌ బ్యూటీగా, ‘జులాయి’లో ఇలియానాను పంటికి క్లిప్పులు, కంటి అద్దాలతో చూపించాడు. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సమంతకు కాసేపు షార్ట్‌ టర్మ్‌ మెమరీ లాస్‌ పేషెంట్‌గా చూపించాడు. తాజాగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో సమంతను డయాబెటిక్‌ పేషెంట్‌గా చూపించాడు. మొత్తానికి త్రివిక్రమ్‌ సినిమా అంటే అందులో హీరోయిన్లకు ఏదో ఒక లోపం ఉండటం ఖాయమైపోతోంది....!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ